Sairaj Bahutule | జైపూర్: రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులె ఎంపికయ్యాడు. రానున్న సీజన్ కోసం బహుతులెను తమ కోచింగ్ బృందంలోకి తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాజస్థాన్ జట్టులో బహుతులె స్పిన్ విభాగానికి సేవలందించనున్నాడు. టీమ్ఇండియా తరఫున రెండు టెస్టులు, 8 వన్డేలాడిన 52 ఏండ్ల సాయిరాజ్‌కు దేశవాళీలో మెరుగైన రికార్డు ఉంది. 6వేల పరుగులకు తోడు 630 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్‌తో పాటు కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు బహుతులె పేర్కొన్నాడు.