హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్ రెడ్డి సత్తాచాటుతున్నాడు.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ పోరులో కార్తీక్, సిద్ధాంత్ జోడీ 6-3, 6-2తో బల్దివినెటీ గుల్పో, రాఘవ్ ద్వయంపై అద్భుత విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్‌లో కార్తీక్ 2-6, 3-6తో ఒలివర్ క్రాఫోర్డ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.