హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత జోడీ సాయికార్తీక్రెడ్డి, విష్ణువర్ధన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో కార్తీక్, విష్ణు ద్వయం 6-4, 6-4తో ఎరిక్ వాన్శెల్బెయిమ్(ఉక్రెయిన్), లూకా కాస్టెనువో(స్విట్జర్లాండ్) జోడీపై గెలిచి ముందంజ వేసింది.
ఆది నుంచే తమదైన దూకుడు ప్రదర్శించిన కార్తీక్ జంట వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.