బెంగళూరు: ఐటీఎఫ్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సహజా యమలపల్లి సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సహజ 6-1, 3-6, 6-1తో నాలుగో సీడ్ రష్యా ప్లేయర్ మరియా తిమోఫీవాపై అద్భుత విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. రెండు గంటల పాటు సాగిన పోరులో తన(315) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న మరియా(134)ను సహజ మట్టికరిపించింది.