హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరేబియన్ దీవులైన డొమినికన్ రిపబ్లిక్ లోని పుంట కానా వేదికగా జరిగిన డబ్ల్యూ35 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ యువ క్రీడాకారిణి సహజ యమలపల్లి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లో సహజ-కులంబయేవ (కజకిస్థాన్) జోడీ.. 1-6, 7-5, 8-10తో అరియానా అర్సెనేల్ట్-కైలా క్రాస్ (కెనడా) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన సహజ డబుల్స్‌లో మాత్రం ఫైనల్‌కు చేరింది.