న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(సాఫ్) అండర్-17 చాంపియన్‌షిప్‌లో భారత్త విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్..గురువారం జరిగిన ఫైనల్లో నేపాల్‌పై 4-0 తేడాతో ఘన విజయం సాధించింది. తుది పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా తరఫున బాబీ సింగ్, కోరౌ సింగ్, గిటె, అమన్ గోల్స్ చేశారు. లీగ్ దశలో నేపాల్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది.