Simon Harmer : టెస్టు క్రికెట్లో బాల్ ఆఫ్ ది సెంచరీ అనగానే దివంగత షేన్ వార్న్ (Shane Warne) గుర్తుకొస్తాడు. ఆ తర్వాత మళ్లీ ఓ స్పిన్నర్ అలాంటి బంతినే సంధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రావల్పిండిలో జరుగుతున్నటెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సిమన్ హార్మర్ (Simon Harmer) నమ్మశక్యంకాని బంతితో పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్‌ను బౌల్డ్ చేశాడు. అనూహ్యంగా టర్న్ తిరిగిన బంతి హక్ ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దాంతో.. ఒక్క క్షణం పాక్ బ్యాటర్‌కు ఏం జరిగిందో అర్ధం కాలేదు. బిగ్ పడినవేల సఫారీ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు.
రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోర్ 30 దాటించారు. 12 ఓవర్దు దాటిన వికెట్ పడకపోవడంతో.. తొలి సెషన్లోనే ఆఫ్ స్పిన్నర్ సిమన్ హార్మర్‌కు కొత్త బంతిని అందించాడు కెప్టెన్. హార్మర్ సంధించిన మూడో బంతిని ఇమాముల్ హక్ డిఫెన్స్ ఆడబోయాడు.
Yes @Simon_Harmer_ 👏🏻 #EssexCricket #HarmyArmy https://t.co/pxlGNPg9Uc
— 🌍Travelling Hammer⚒️ (@JimBwick) October 20, 2025
కానీ, బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దాంతో.. ఇదేం బాల్? అని పాక్ బ్యాటర్ షాక్‌లో ఉండిపోయాడు. స్టేడియంలోని అభిమానులు, కామెంటేట్లు సైతం హార్మర్ మ్యాజిక్ బంతికి ఫిదా అయిపోయారు. ఊహించనివిధంగా టర్న్ అయిన ఆ బంతిని.. ది బాల్ ఆఫ్ సెంచరీగా పేర్కొంటున్నారు క్రికెట్ నిపుణులు. అంతటి అద్భుతమైన బౌలింగ్ చేసిన హార్మర్ వీడియో మీరూ చూసేయండి.