Sachin Tendulkar | అసాధ్యాన్ని చేసి చూపించావ్.. నువ్వొక స్ఫూర్తి ప్రదాత.. దివ్యాంగ క్రికెటర్‌పై సచిన్ ప్రశంసలు
Sachin Tendulkar : సంకల్ప బలంతో కొండల్ని పిండి చేసిన ధీరుల కథలు విన్నాం. శారీరక లోపం కారణంగా అడుగడుగునా అవమానాలు, ఆటుపోట్లు ఎదురైనా అదరకబెదరక విజయ ఢంకా మోగించిన సామాన్యుల గురించి చదివాం. జమ్మూకశ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్ లోనె (Amir Hussain Lone) కథ కూడా దాదాపు అలాంటిదే. విధి రాతను ఎదిరించిన ఈ కుర్రాడు..
Sachin Tendulkar : సంకల్ప బలంతో కొండల్ని పిండి చేసిన ధీరుల కథలు విన్నాం. శారీరక లోపం కారణంగా అడుగడుగునా అవమానాలు, ఆటుపోట్లు ఎదురైనా అదరకబెదరక విజయ ఢంకా మోగించిన సామాన్యుల గురించి చదివాం. జమ్మూకశ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్ లోనె (Amir Hussain Lone) కథ కూడా దాదాపు అలాంటిదే. విధి రాతను ఎదిరించిన ఈ కుర్రాడు చేతులు లేకున్నా క్రికెట్లో రాణిస్తున్నాడు. మెడ, గదవ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న అతడి వీడియో ఈ మధ్య తగె వైరల్ అయింది. ఆ వీడియో చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) అమిర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘అమిర్ బ్యాటింగ్ వీడియోను ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేసిన సచిన్.. దానికి అమిర్ అసాధ్యాన్ని చేసి చూపించాడు. అతడి వీడియో నన్ను ఎంతగానో కదిలించింది. అందులో ఆటపట్ల అతడికున్న ప్రేమ, అంకితభావాన్నిచాటాడు. ఏదో ఒక రోజు అమిర్‌ని కలిసి అతడి పేరుతో ఉన్న జెర్సీని బహుమతిగా తీసుకుంటా. క్రీడల్లో రాణించాలనుకునే లక్షలాది మందికి నువ్వొక స్ఫూర్తి ప్రదాత’ అంటూ రాసుకొచ్చాడు.
And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game.
Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT
— Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024
మిషిన్‌లో జాకెట్ చిక్కొకొని
అమిర్ పుట్టికతోనే దివ్యాంగుడు కాదు. ఎనిమిదేండ్ల వయసులో అతడు రెండు చేతులు కోల్పోయాడు. అమిర్ కుటుంబానికి ఒక చిన్న వండ్రంగి షాపు (కట్టె మిషన్) ఉండేది. అందులో అమిర్ నాన్న, సోదరుడు పనిచేసేవాళ్లు. ఒకరోజు అమిర్ అన్నయ్యకు లంచ్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అనుకోకుండా అతడి జాకెట్ మిషిన్‌లో ఇరుక్కుపోయింది. దాంతో, అమిర్ రెండు చేతులు పోగొట్టుకున్నాడు. అలాగని నిరుత్సాహపడలేదు.

క్రికెట్ మీద ఇష్టంతో సాధన చేయడం మొదలెట్టాడు. కానీ, చేతులు లేకుండా బ్యాటు పట్టుకోవడం అమిర్‌కు కష్టమయ్యేది. అయినా సరే ఆత్మవిశ్వాసమే ఆయుధంగా భావించే అమిర్ మెడ, గదవ సాయంతో బ్యాటు హ్యాండిల్ పట్టుకోవడం సాధన చేశాడు. కొన్ని రోజుల్లోనే బ్యాటు పట్టుకోవడంలో పట్టు సాధించాడు. ప్రస్తుతం అమిర్ జమ్ముకశ్వీర్ పారా క్రికెట్ జట్టు(Para Cricket Team)కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆన్లైన్లో అమిర్ వీడియో చూసినవాళ్లంతా నీ పట్టుదల, అంచంచలమైన ఆత్మవిశ్వాసానికి సలాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- Amritha Aiyer | హనుమాన్ ప్రమోషన్స్‌లో అమృత అయ్యర్ సందడి..
- Ishan Kishan | సెలెక్టర్లు పట్టించుకోలే.. మౌన ముద్రలో యువ ఓపెనర్.. వీడియో
- Singareni CMD | కార్మికులతో కలిసి క్యాంటీన్లో టిఫిన్ చేసిన సింగరేణి సీఎండీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

