ఇకపై ముంబై బ్యాటింగ్ కోచ్‌గా..
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. 13 సీజన్లుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పొలార్డ్.. సామాజిక మాధ్యమాల వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ రిటెన్షన్‌కు మంగళవారం ఆఖరి రోజు కావడంతో.. జట్టు యాజమాన్యంతో చర్చించిన అనంతరం రిటైర్మెంట్ పలికాడు. ఐపీఎల్లో 189 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 3412 పరుగులు చేశాడు. కాగా, జట్టును పునర్నిర్మించే పనిలో ఉన్న ముంబై.. పొలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది.