Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగా బెనౌలిమ్ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేస్తూ కనిపించారు. అనంతరం వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
అనంతరం బీచ్ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లో ఫుడ్‌ను కుమారుడితో కలిసి సచిన్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వీడియో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు సచిన్ సింప్లిసిటీని మరోసారి మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.