Sachin Dhas : అండర్ -19 వరల్డ్ కప్‌లో ఓటమెరుగని భారత జట్టు(Team India) సెమీ ఫైనల్లో మాత్రం అతికష్టంమీద గట్టెక్కింది. దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టినా.. కుర్రాళ్లు అదరక బెదరక రఫ్ఫాడించారు. ఈ మ్యాచ్‌లో యంగ్‌స్టర్ సచిన్ ధాస్ (Sachin Dhas) కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగులకే 4 కీలక వికెట్లు పడిన జట్టును కెప్టెన్ ఉదయ్ సహరన్ (Uday Saharan)తో కలిసి గెలుపు వాకిట నిలిపాడు.
సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. నాలుగు పరుగులతో సెంచరీ చేజార్చుకున్నా.. తన సంచలన ఆటతో అనిపించుకున్నాడు. సెమీఫైనల్లో అతడి ఆట చూసినవాళ్లంతా జూనియర్ సచిన్ దొరికేశాడంటూ ఆన్లైన్లో కామెంట్లు పెడుతున్నారు.
సచిన్ ధాస్
సచిన్ ధాస్ 2005 ఫిబ్రవరి 3వ తేదీన మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి సంజయ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. క్రికెట్ అంటే అతడికి అమితమైన ఇష్టం దాంతో అతడు కొడుక్కి తన ఆరాధ్యక్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు కలిసేలా.. ‘సచిన్ ధాస్’ అని పేరు పెట్టాడు. నాలుగున్నర ఏండ్ల నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. అండర్ -14, అండర్ -16, అండర్ -19 విభాగాల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
A brave 96-run knock from Sachin Dhas comes to an end 👏👏
He departs after rescuing #TeamIndia out of trouble.
The #BoysInBlue need 42 off 46.
Follow the match ▶️ https://t.co/Ay8YmV8QDg#INDvSA pic.twitter.com/fDDo5pZZux
— BCCI (@BCCI) February 6, 2024
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో భారత్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(0), అర్శిన్ కులకర్ణి(12)లు, ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్(4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సచిన్.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సహరన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 171 రన్స్ జోడించాడు. వీళ్లిద్దరూ అర్ధ సెంచరీలు బాదడంతో భారత జట్టు లక్ష్యాని చేరవైంది.
The #BoysInBlue are into the FINAL of the #U19WorldCup! 🥳
A thrilling 2⃣-wicket win over South Africa U-19 👏👏
Scorecard ▶️ https://t.co/Ay8YmV8QDg#TeamIndia | #INDvSA pic.twitter.com/wMxe7gVAiL
— BCCI (@BCCI) February 6, 2024
అయితే.. 96 పరుగుల వద్ద సచిన్ ఔటైనా.. సహరన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. ఓ వైపు సఫారీ పేసర్లు వికెట్లు తీస్తున్నా.. ఒత్తిడికి లోనవ్వకుండా టెయిలెండర్లతో కలిసి టీమిండియాను మ్యాచ్‌లో నిలిపాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో అతడు ఔటైనా.. రాజ్ లింబానీ(13 నాటౌట్) బౌండరీతో జట్టును గెలిపించాడు. దాంతో, భారత్ రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. ఇప్పటివరకూ ఆరు మ్యాచుల్లో 73.50 సగటుతో 294 రన్స్ సాధించాడు.