Avinash Mukund Sable | భారత యువ అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సాబ్లె అదరగొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల 3000మీ స్టిపుల్చేజ్ రేసులో సాబ్లె ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తద్వారా విశ్వక్రీడల్లో తుదిపోరుకు అర్హత పొందిన తొలి భారత అథ్లెట్‌గా సాబ్లె నిలిచాడు. హీట్స్-2లో పోటీకి దిగిన సాబ్లె 8:15:43 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో పాల్గొన్న టిండఫ్ట్(మొరాకో) అగ్రస్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు ల్యాప్‌లు దూకుడు కనబరిచిన సాబ్లె..మిగిలిన ల్యాప్‌లలో ఒకింత వెనుకంజ వేశాడు. మరోవైపు మహిళల 400మీ రేసులో కిరణ్ పహల్(52.51సె) ఏడో స్థానంలో నిలిచింది.