ముంబై: సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తన తల్లి బర్త్‌డే వేడుకను ఇంట్లో నిర్వహించాడు. కేక్ కటింగ్ ఈవెంట్‌కు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు కాబోయే భార్య సానియా హాజరైంది. ఇటీవల అర్జున్, సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తల్లి బర్త్‌డే వేడుకులకు చెందిన ఫోటోలను సచిన్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్షల మంది ఆ పిక్‌ను లైక్ చేశారు. వేలల్లో కామెంట్లు వచ్చాయి. మనసుకు హత్తకునే సందేశాన్ని సచిన్ తన పోస్టులో పెట్టారు. తన దీవెనలతోనే తాను ప్రగతి సాధించినట్లు చెప్పారు. నువ్వు దృఢంగా ఉండడం వల్లే కుటుంబం అంతా దృఢంగా ఉన్నట్లు సచిన్ తన పోస్టులో తల్లిని కీర్తించారు.
तुझ्या पोटी जन्माला आलो, म्हणून मी घडलो
तुझा आशीर्वाद होता
म्हणून मी प्रगती करत राहिलो
तू खंबीर आहेस
म्हणूनच आम्ही सगळे खंबीर राहिलो
वाढदिवसाच्या शुभेच्छा आई! pic.twitter.com/StD9cc9ROC— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2025