SA20 : ప్రపంచమంతా విస్తరించిన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ సందడి రేపటితో దక్షిణాఫ్రికాలో మొదలవ్వనుంది. మూడు సీజన్లుగా అభిమానులను అరలిస్తున్న ఎస్ఏ20 నాలుగో ఎడిషన్ డిసెంబర్ 26 నుంచి షురూ కానుంది. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ తరహాలో క్రేజ్ సంపాదించుకున్న ఎస్ఏ20లో టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి. దాదాపు నెలరోజులు ఉత్కంఠ పోరాటాలతో కొనసాగే ఈ టోర్నీలో విజేత ఎవరో జనవరి 25న జరిగే ఫైనల్‌తో తేలిపోనుంది.
టీ20ల్లోని మజాను అభిమానులకు పంచేందుకు ఎస్ఏ20 సిద్ధమవుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగో సీజన్ రేపటి నుంచే ప్రారంభమవుతుంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ కేప్‌టౌన్‌తో డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడనుంది. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నాలుగు వారాల పాటు సందడిగా సాగే ఈ టోర్నీలో టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్తాయి. జనవరి 25న ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది. టోర్నీ ఆరంభానికి మరికొన్ని గంటలే ఉన్నందున గురువారం లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్, జేపీ డుమినీ, డూప్లెసిస్, షాన్ పొలాక్, హషీం ఆమ్లాలు ట్రోఫీని ఆవిష్కరించారు.
Season 1⃣ – Sunrisers Eastern Cape 🏆
Season 2⃣ – Sunrisers Eastern Cape 🏆
Season 3⃣ – MI Cape Town 🏆
Season 4⃣ – ❓❓❓#BetwaySA20 #WelcomeToIncredible pic.twitter.com/UsPHLawqXg— Betway SA20 (@SA20_League) December 25, 2025
జనవరి 21 – క్వాలిఫయర్ 1 – టేబుల్ టాపర్స్ మధ్య.
జనవరి 22 – ఎలిమినేటర్ – మూడు, నాలుగో స్థానాల్లోని జట్ల మధ్య.
జనవరి 23 – క్వాలిఫయర్ 2 – క్వాలిఫయర్ 1లో ఓడి.. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్లు తలపడుతాయి.
జనవరి 25, ఫైనల్ – క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 మధ్య జరుగుతుంది.
Instant nostalgia 💙✨#MICapeTown #OneFamily #SA20 #MI pic.twitter.com/P3K7Ju2ysa
— MI Cape Town (@MICapeTown) December 25, 2025
బెట్‌వే ఎస్ఏ20 నాలుగో సీజన్ మినీ వేలం సెప్టెంబర్ 29న నిర్వహించారు. ఈ ఆక్షన్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) రూ.8.3 కోట్ల రికార్డు ధర పలికాడు. ఈ చిచ్చరపిడుగును ప్రిటోరియా క్యాపిటల్స్ దక్కించుకుంది. ఎస్ఏ 20 వేలంలో బ్రెవిస్ అత్యధిక ధరతో రికార్డు నెలకొల్పగా ఏడెన్ మర్క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన మర్క్రమ్ వేలంలో రూ.7.5 కోట్లు పలికాడు. ఆల్‌రౌండర్ అయిన అతడిని డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. వియాన్ మల్డర్‌ను రూ.4.5కోట్లకు జోబర్గ్ సూపర్ కింగ్స్ పట్టేసింది.
ఎంఐ కేప్‌టౌన్ స్క్వాడ్ : రషీద్ ఖాన్(కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, నికోలస్ పూరన్, రబడ, డస్సెన్, రికెల్టన్, హెండ్రిక్స్, లిండే, బాష్, ప్రిటోరియస్, కరిమ్ జనత్, టామ్ మూరెస్, జేసన్ స్మిత్, డానే పీడ్ట్, థామస్ కబెర్, జాక్వెస్ స్నిమాన్, ట్రిస్టన్ లుస్, డాన్ లటెగన్, తియాన్ వాన్ వూరెన్,
డర్బన్ సూపర్ జెయింట్స్ స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), జోస్ బట్లర్, క్లాసెన్, విలియమ్సన్, నరైన్, నూర్ అహ్మద్, కొయెట్జీ, కాన్వే, డేవిడ్ బెడింగమ్, ఈథన్ బాష్, మఫాకా, డిజొర్జి, డారిన్ డుపవిలన్, ఎవాన్ జోన్స్, మల్డర్, మర్కూస్ అకెర్మన్, డయ్యాన్ గలీమ్, డేవిడ్ వీస్, అండిలే సిమెలనే.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ స్క్వాడ్ : ట్రిస్టన్ స్టబ్స్(కెప్టెన్), క్వింటన్ డికాక్, జానీ బెయిర్‌స్టో, అన్రిచ్ నోర్జి, మార్కో యాన్సెన్, ఆడం మిల్నే, గజన్ఫర్, మాథ్యూ బ్రీట్జ్, జోర్డాన్ హెర్మన్, జేమ్స్ కొల్స్, లెవిస్ గ్రెగరీ, బేయర్స్ స్వానెపొయెల్, ప్యాట్రిక్ క్రుగెర్, సెనురన్ ముత్తుస్వామి, ల ఉ త ఓ సిపమ్లా, మిచెల్ వాన్ బురెన్, క్రిస్ వుడ్, సీజే కింగ్, జేపీ కింగ్.
Durban’s Super Giants Probable XI for SA20 2025-26 is HERE!💙🇿🇦
Led by skipper Aiden Markram, with explosive stars like Jos Buttler, Devon Conway, and Heinrich klassen ready to light up the tournament! 🏆💥🔥 pic.twitter.com/ftli9Tfnhg
— CricketGully (@thecricketgully) December 24, 2025
ప్రిటోరియా క్యాపిటల్స్ స్క్వాడ్: కేశవ్ మహరాజ్(కెప్టెన్), బ్రెవిస్, రస్సెల్, విల్ జాక్స్, రూథర్‌ఫోర్డ్, ఎంగిడి, విలియమ్స్, ఓవర్టన్, సకీబ్ మహమూద్, విల్ స్మీద్, బ్రసే పార్సన్స్, కొడి యూసుఫ్, కొన్నొర్ ఈస్టర్హుజెన్, జునైద్ దావూద్, విహాన్ లుబే, సిబొనెలో మఖాన్య, గొడీన్ పీటర్స్, మెకా ఈల్ ప్రిన్స్, బయండ మజొలా.
జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్ : డూప్లెసిస్(కెప్టెన్), రస్సో, జేమ్స్ విన్సే, బ్రాండన్ కింగ్, ఇమ్రాన్ తాహిర్, బర్గర్, టాప్లే, అకీల్ హొసేన్, రిచర్డ్ గ్లీసన్, ఫెరీరా, మల్డర్, డానియల్ వొర్రాల్, ప్రెనెలన్ సుబ్రయెన్, రివల్డో మూన్సామి, సుభ్రమ్ రంజనే, డియాన్ ఫారెస్టర్, స్టీవ్ స్టోల్క్, జాన్కో స్మిత్, నీల్ ట్రిమ్మెర్స్.
పార్ల్ రాయల్స్ స్క్వాడ్ : డేవిడ్ మిల్లర్(కెప్టెన్), సికిందర్ రజా, బట్లర్, ముజీబ్ రెహ్మాన్, మోతీ, ఫార్చూన్, డ్రె ప్రిటోరియస్, బార్ట్‌మన్, వెర్రీనే, లారెన్స్, హర్డూస్ విజియోన్, రుబిన్ హెర్మాన్, డెలానో పొటిగీటర్, పీటర్, ఇషాన్ మలింగ, మొకీన, అసా ట్రిబే, కేగన్ లయన్ కాచెట్, విషెన్ హలంబగే.