న్యూఢిల్లీ: దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైటర్ పైలట్‌కు రష్యా నివాళి అర్పించింది. రష్యాకు చెందిన నైట్స్ ఏరోబాటిక్స్ బృందం ప్రత్యేకంగా మిస్సింగ్ మ్యాన్ విన్యాసంతో నివాళి అర్పించింది. దుర్ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రష్యా బృందం ఆ నివాళి స్టంట్ పర్ఫార్మ్ చేసింది. రష్యన్ నైట్స్‌కు చెందిన బృందం ఆ నివాళి వీడియోను రిలీజ్ చేసింది. ఆ ప్రమాదం వర్ణించడానికి వీలుకాని రీతిలో ఉందని ఆ వీడియోకు రాశారు. చివరి ఫ్లయిట్లో పాల్గొని తిరిగిరాని లోకాలకు వెళ్లిన వారి జ్ఞాపం కోసం ఆఖరి రోజున నివాళి అర్పించినట్లు రష్యా బృందం పేర్కొన్నది.
💔🇮🇳🇷🇺 “In memory of those brothers who never returned from their last flight”
After the crash of an Indian Tejas fighter jet, the ‘Russian Knights’ aerobatic team shared a video of their performance at the Dubai Airshow 2025, honoring the lost souls. pic.twitter.com/rJ67QxNnP4
— Sputnik India (@Sputnik_India) November 23, 2025
అమెరికా బృందం కూడా ఆ విషాద ఘటన తర్వాత తన వాయు విన్యాసాలను వాయిదా వేసింది. కెప్టెన్ టేలర్ హెయిస్టర్ ఆ ఘటన పట్ల షాక్ వ్యక్తం చేసింది. భారతీయ పైలట్‌కు గౌరవార్ధం తమ విన్యాసాలను రద్దు చేసినట్లు యూఎస్ ఎఫ్-16 బృందం ప్రకటించింది.