నేరేడ్మెట్: బెంగళూరు వేదికగా జరిగిన 46వ జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రక్షిత, రుషేంద్ర విజేతలుగా నిలిచారు. బాలికల అండర్-19 విభాగం ఫైనల్లో గోపీచంద్ అకాడమీ ప్లేయర్ రక్షితశ్రీ 9-21, 21-13, 21-18తో అన్మోల్‌పై విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది.
బాలుర విభాగం తుదిపోరులో రుషేంద్ర 21-18, 21-18, 21-16తో సమర్వీర్పై గెలిచాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్, వైష్ణవి జోడీ విజయం సాధించింది. జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లను చీఫ్ కోచ్ గోపీచంద్, సీనియర్ కోచ్ రాజేందర్, అనిల్ తదితరులు అభినందించారు.