హైదరాబాద్, ఆట ప్రతినిధి : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. పురుషుల విభాగంలో ఆరు జట్లు, మహిళల విభాగంలో నాలుగు జట్లు ఈ లీగ్‌లో పోటీ పడుతున్నాయి. మాన్యుల్ మరెనో కెప్టెన్సీలోని ఆతిథ్య హైదరాబాద్ హీరోస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ నెల 28 వరకు జరిగే మెగా లీగ్‌కు సంబంధించిన అధికారిక బాల్‌ను గచ్చిబౌలి స్టేడియంలో 10 జట్ల కెప్టెన్లతో కలిసి లీగ్ కమిషనర్ రాహుల్ బోస్ ఆవిష్కరించారు.