బండ్లగూడ: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలో ఆర్టీసీ ఉద్యోగి కొంగల శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. గోవాలో జరిగిన ఆరవ జాతీయ మాస్టర్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడకు చెందిన శ్రీనివాస్ సత్తాచాటాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ప్రతిభ చాటాడు. నిర్వహకులు ఆయనను అభినందిస్తూ పతకంతో పాటు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో శ్రీనివాస్ పతకాలు సాధించాడు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ పోటీల్లోనూ సాధించాలని స్నేహితులు, స్థానికులతో పాటు ఆర్టీసీ అధికారులు ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను పతకాలు సాధిస్తున్నానని శ్రీనివాస్ పేర్కొన్నాడు.