రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.
దాంతో బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ (106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది. బట్లర్‌కు యశస్వి జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23) మంచి సహకారం అందించారు.
దేవదత్ పడిక్కల్ (9) నిరాశ పరిచినా కూడా.. హెట్మెయర్ (2 నాటౌట్)తో కలిసి బట్లర్ లాంఛనం పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హసరంగ ఒక వికెట్ తీసుకున్నాడు. 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరిన రాజస్థాన్.. మరోసారి గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఆదివారం ఇదే స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.
WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏
Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB
Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX
— IndianPremierLeague (@IPL) May 27, 2022