కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు అద్బుతమైన ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతనికి యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ పూర్తిగా సహకరించాడు. కేవలం యాంకర్ రోల్‌కే పరిమితమై సాధ్యమైనంత స్ట్రైకింగ్‌ను బట్లర్‌కే ఇచ్చేస్తూ వచ్చాడు.
దీంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 60 పరుగులు పూర్తి చేసింది. కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎంతమంది బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అతను ఇప్పటికే ఉమేష్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి చేత బౌలింగ్ చేయించాడు. కానీ వీళ్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.