ఐపీఎల్లో 150వ మ్యాచ్ ఆడుతున్న స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మద్య జరుగుతున్న మ్యాచ్‌లో.. కేకేఆర్ బౌలర్లను రాజస్థాన్ ఓపెనర్లు ఓ ఆట ఆడేసుకున్నారు. ముఖ్యంగా బట్లర్ (66 నాటౌట్) దొరికిన ప్రతి బంతినీ బౌండరీ దాటిస్తూ వచ్చాడు. అతనికి పూర్తి సహకారం అందించిన దేవదత్ పడిక్కల్ (24) కూడా పదో ఓవర్లో బ్యాటు ఝుళిపించడానికి ప్రయత్నించాడు.
నరైన్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే అదే ఓవర్ నాలుగో బంతికి అతన్ని బుట్టలో వేసిన నరైన్.. పడిక్కల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌తోపాటు రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ ఉన్నాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది.
A much-needed breakthrough for @KKRiders! 👍 👍
Sunil Narine strikes to get Devdutt Padikkal out. 👏 👏
Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/qOeI6V0qzC
— IndianPremierLeague (@IPL) April 18, 2022