బెంగళూరు జోరు.. చెన్నైకి హ్యాట్రిక్ పరాభవం
ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం.
బెంగళూరు : ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఊచకోతకు తోడు దేవ్‌దత్ పడిక్కల్ (29 బంతుల్లో 50, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రజత్ పటీదార్ (19 బంతుల్లో 48 నాటౌట్, 1 ఫోర్, 6 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (30 బంతుల్లో 46, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగుల రికార్డు స్కోరు చేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే.. 19.4 ఓవర్లకు 207 రన్స్ వద్దే ఆగిపోయింది.
టాపార్డర్ విఫలమైనా సర్ఫరాజ్ (50), ప్రశాంత్ (43), ఓవర్టన్ (37) పోరాటంతో ఆ జట్టుకు అవమానకర ఓటమి నుంచి తప్పించారు. భువనేశ్వర్ (3/41), కృనాల్ (2/36), డఫ్ఫీ (2/58) చెన్నైని కట్టడిచేశారు. భారీ ఛేదనలో సంజూ (9) మరోసారి నిరాశపరచగా గత మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రె (1), కెప్టెన్ రుతురాజ్ (7) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన భువీ.. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి సీమర్‌గా రికార్డులకెక్కాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

