Gabba Test : యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ గబ్బా టెస్టు (Gabba Test)లో తడబడి నిలబడింది. జో రూట్ (135 నాటౌట్) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్(6-71) నిప్పులు చెరిగినా.. క్రీజులో పాతుకుపోయిన రూట్ టెయిలెండర్లతో పోరాడి జట్టు స్కోర్ మూడొందలు దాటించాడు. జోఫ్రా ఆర్చర్(32 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు రూట్ 61 రన్స్ జోడించాడు. ఫలితంగా మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 325 పరుగులు చేసి పరువు కాపాడుకుంది.
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులోనూ ఇంగ్లండ్ తొలి రోజే షాక్ తగిలింది. పెర్త్‌లో పది వికెట్లు తీసి.. బెన్ స్టోక్స్ బృందాన్ని కుప్పకూల్చిన మిచెల్ స్టార్క్(6-761) మరోసారి పర్యాటక జట్టును దెబ్బకొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే పెద్ద షాకిస్తూ ఓపెనర్ బెన్ డకెట్(0), ఓలీ పోప్(0)లను ఔట్ చేశాడు స్టార్క్.
Joe Root savours his 40th Test ton in the Gabba Test 🤩👌#WTC27 | #AUSvENG 📝: https://t.co/BNKjBSJuJb pic.twitter.com/udXqJ3b9dB
— ICC (@ICC) December 4, 2025
స్టార్క్ విజృంభణతో 5 పరుగులకే 2 వికెట్లు పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్(135 నాటౌట్ 202 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే(76)తో కలిసి స్కోర్‌బోర్డును నడిపించిన రూట్.. 181 బంతుల్లో కంగారూ గడ్డపై మొదటి శతకం సాధించాడు. ఈ ఫార్మాట్లో రూట్‌కిది 40వ సెంచరీ కావడం విశేషం.
క్రాలే, రూట్ ద్వయాన్ని నెసర్ విడదీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్(31)ను పెవిలియన్ పంపిన స్టార్క్.. డేంజరస్ జేమీ స్మిత్(0), విల్ జాక్స్(19), గస్ అట్కిన్సన్(4), బ్రైడన్ కార్సే(0)లను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. 264 పరుగులకే 9 వికెట్లు పడినా రూట్ మాత్రం పట్టువదల్లేదు. చివరి బ్యాటరైన జోఫ్రా ఆర్చర్(32 నాటౌట్) సహకారంతో జట్టు స్కోర్ 300 దాటించాడు. వికెట్ కాపాడుకుంటూ చక్కని షాట్లు ఆడిన ఆర్చర్, రూట్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. గబ్బాలో ఐదో వికెట్ తీశాక పాక్ దిగ్గజం వసీం అక్రమ్ రికార్డు బ్రేక్ చేశాడు స్టార్క్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా చరిత్రకెక్కాడు ఆసీస్ స్పీడ్‌స్టర్
Mitchell Starc passes Wasim Akram as the most prolific left-arm bowler in Test cricket history 🤩#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/gxzYjLGR2S
— cricket.com.au (@cricketcomau) December 4, 2025