Christiano Ronaldo : పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ క్రిస్మస్కు ఖరీదైన కారును బహుమతిగా అందుకున్నాడు. అతని ప్రియురాలు జార్జినా రోడ్రిగ్ రూ.2.4 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు కొనిచ్చింది. రొనాల్డోతో కారులో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు అద్బుతమైన క్రిస్మస్ రాత్రి. థ్యాంక్యూ శాంటా అంటూ క్యాప్షన్ రాసింది. రొనాల్డో కూడా తన కొత్త కారు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. థ్యాంక్యూ మై లవ్ అని కామెంట్ చేశాడు. జార్జినా రోడ్రిగ్ స్పెయిన్‌కు చెందిన మోడల్. ఆమె గూచీ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో రొనాల్డోతో పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2017 నుంచి డేటింగ్లో ఉన్నారు.
ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ రోనాల్డోకు తీరని బాధను మిగల్చింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న అతడిని కీలకమైన మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితం చేశారు. క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో రెండో అర్థభాగంలో రొనాల్డోను అనుమతించారు. కానీ, అప్పటికే మొరాకో లీడ్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో 1-0తో మొరాకో గెలిచింది. దాంతో, వరల్డ్ కప్ గెలవాలనుకున్న రొనాల్డో కల చెదిరింది. వరల్డ్ కప్ టోర్నీ మధ్యలోనే మ్యాన్ యూనైటెడ్ క్లబ్ అతనితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది. దాంతో, రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో చర్చలు జరుపుతున్నాడు. ఆ క్లబ్‌తో అతను ఏడాదికి 175 మిలియన్ యూరోల ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.