లండన్: ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో కండ్లు చెదిరే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇన్నాళ్లు యూరోపియన్, ఇటలీ, స్పెయిన్ క్లబ్‌ల తరఫున మెరుపులు మెరిపించిన ఈ పోర్చుగల్ స్టార్ తొలిసారి ఆసియాలో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో తాజాగా సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్‌తో కలిసి కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. సౌదీలో ప్రముఖ క్లబ్‌గా పేరొందిన అల్ నసర్..రొనాల్డోతో జూన్ 2025 వరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 200 మిలియన్ యూరోల చొప్పున మొత్తంగా రికార్డు స్థాయిలో 4,400 కోట్ల రూపాయలతో డీల్ కుదిరింది. సాకర్ చరిత్రలో ఒక ప్లేయర్‌కు దక్కనున్న అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం.