Cristiano Ronaldo : పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఆటకు ఫిదా అవ్వని అభిమానులు ఉండరు. సౌదీ అరేబియాకు చెందిన అన్ నస్రీ(Al Nassr) తరఫున చెలరేగిపోతున్న రొనాల్డో తాజాగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.
‘నా భార్యను మీకు పరిచయం చేస్తున్నా’ అని చెప్పి.. గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్ (Jeorgina Rodrigue)ను ఆహ్వానించాడు. దాంతో, ఇద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రొనాల్డో, జార్జినాలు 2017 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ప్రేమ జంట ఈ ఏడేండ్లలో ఐదుగురు పిల్లలను కన్నది. ఇప్పిటికైనా రొనాల్డోకు ఆమెను వివాహం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
జార్జినా, రొనాల్డో
రొనాల్డో ఈమధ్య నాలుగు దేశాల్లోని లీగ్స్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా రికార్డుకెక్కాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన 3 రొనాల్డో ఇంతకుముందు ప్రీమియర్ లీగ్(Premier League), లా లిగా(La Liga), సెరీ ఏ(SerieA) తరఫున అత్యధిక గోల్స్ వీరుడిగా నిలిచాడు.
ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో నిరుడు ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపికయ్యాడు. 2023లో అత్యధికంగా 54 గోల్స్ కొట్టినందుకు మారడోనా అవార్డు (Maradon Award)కు ఎంపికయ్యాడు. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్(Dubai Globe Soccer Awards) పండుగలో జనవరి 19వ తేదీన.. ఈ ఫార్వర్డ్ ప్లేయర్ బెస్ట్ గోల్ స్కోరర్ అవార్డును అందుకోనున్నాడు.
ఖతార్‌లో నిరుడు జరిగిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) రొనాల్డో కెరీర్‌ను మలుపుతిప్పిందనే చెప్పాలి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు ఇంగ్లండ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) క్లబ్ యాజమాన్యం తీరును తప్పుపట్టాడు.
దాంతో, మాంచెస్టర్ క్లబ్ రొనాల్డోతో ఒప్పంద్దం రద్దు చేసుకుంది. మెగా టోర్నీ అనంతరం ఈ స్టార్ ప్లేయర్‌ను అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.