హైదరాబాద్, ఆట ప్రతినిధి : దక్షిణాకొరియా వేదికగా జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్కేటర్ పడిగ తేజేశ్ పతక జోరు కనబరిచాడు. 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో మూడు వేర్వేరు విభాగాల్లో తేజేశ్ మూడు పతకాలతో సత్తాచాటాడు.
పెయిర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకంతో మెరిసిన తేజేశ్ క్వార్టెట్ స్కేటింగ్లోనూ మరో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా షో గ్రూపు స్కేటింగ్లోనూ స్వర్ణం దక్కించుకున్నాడు.