ముంబై: వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కొంత బ్రేక్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. నెట్స్‌లో అతను ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ సెషన్‌కు చెందిన ఓ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అతను ఈ ఏడాది చివరగా క్రికెట్ ఆడాడు. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో మళ్లీ మైదానంలోకి దిగే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఆ ఉద్దేశంతోనే అతను మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ప్రాక్టీస్ సమయంలో అభిషేక్ నాయర్ అతనికి సహకరించాడు. ఇన్‌స్టాలో రోహిత్ పోస్టు చేసిన వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ అతని భార్య రితిక సాజ్దే భావోగ్వేగభరిత కామెంట్ చేశారు. గూజ్బంప్స్ వస్తున్నట్లు ఆమె రోహిత్ పోస్టుకు రియాక్ట్ అయ్యారు. దీంతో పాటు కన్నీళ్లతో నిండిన మూడు కంటి ఎమోజీలను కూడా ఆ పోస్టుకు ఆమె యాడ్ చేసింది.
అయితే రోహిత్ మాత్రం తన ప్రాక్టీస్ సమయంలో చాలా ఫిట్‌గా ఉన్నట్లు కనిపించాడు. ఛాలెంజింగ్‌గా మారనున్న ఆ వన్డే టూరుకు సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ తన ప్రాక్టీస్‌తో చెప్పేశాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025-27 సిరీస్ ప్రారంభానికి ముందే టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2025 వరకు రోహిత్ 67 టెస్టులు ఆడాడు. దాంట్లో అతను 40.17 సగటుతో 4301 రన్స్ స్కోర్ చేశాడు. 12 సెంచరీలు, 18 ఫిఫ్టీలు ఉన్నాయి.