ముంబై: భారత కెప్టెన్ రోహిత్‌శర్మకు పుత్రోత్సాహం కల్గింది. శుక్రవారం రాత్రి రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి మగబాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు.
రోహిత్, రితికాకు 2018లో సమైరా జన్మించింది. ఇదిలా ఉంటే రెండో సంతానం కోసం స్వదేశంలో ఉండిపోయిన హిట్‌మ్యాన్..పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఈనెల 22 నుంచి తొలి టెస్టు నాటికి రోహిత్ జట్టుతో చేరేది లేనిది త్వరలో తేలనుంది.