ICC ODI Rankings | పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రెండోస్థానానికి చేరుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని.. పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌ను వెనక్కి నెట్టాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బాబర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ప్రస్తుతం బాబర్ మూడోస్థానానికి చేరుకున్నాడు.
తాజా ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. గిల్ ఖాతాలో 784 పాయింట్లు, రోహిత్ ఖాతాలో 756 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
విరాట్ ఖాతాలో 736 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరుగనున్నది. ఐసీసీ విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ ఎనిమిది స్థానంలో ఉండగా.. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 15వ స్థానంలో ఉన్నాడు. రోహిత్, ఇద్దరు చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే ఫార్మాట్లో ఆడారు. ఐపీఎల్ 2025 మధ్యలో టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ ఆగస్టులో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌కు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతారని భావించినా.. ద్వైపాక్షిక సిరీస్ 2026కి వాయిదా పడింది. ప్రస్తుతం రోహిత్, విరాట్ ఇద్దరు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.