Rohit Sharma : భారత వన్డే సారథిగా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఆస్ట్రేలియా సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను కెప్టెన్‌గా ఎంపిక చేసి హిట్‌మ్యాన్‌కు షాకిచ్చింది అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ. వచ్చే వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అగార్కర్ చెప్పినా సరే.. పలువురు అతడిని విమర్శిస్తున్నారు. ఈ ఫార్మాట్లో ది బెస్ట్ కెప్టెన్ అయిన రోహిత్ ఉండగా.. యువకుడైన గిల్‌కు పగ్గాలు అప్పగించడం ఏంటని? అభిమానులే కాదు మాజీలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే..తన వారసుడిగా గిల్ వన్డే సారథ్యం స్వీకరిస్తాడని రోహిత్ ముందే ఊహించాడు. తన కెప్టెన్సీ పోతుందని పదమూడేళ్ల కిందటి ట్వీట్లో అతడు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ పాత ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.
‘ఒక అధ్యాయం (45) ముగిసింది. కొత్త శకం (77) ప్రారంభం కానుంది’ అని రోహిత్ 2012లో ట్వీట్ చేశాడు. దానర్థం అప్పుడు చాలామందికి తెలియలేదు. ఎందుకంటే.. ఆ ట్వీట్లో రోహిత్ నేరుగా ఏమీ చెప్పలేదు. కేవలం జెర్సీ నంబర్లతో హింట్ ఇచ్చాడంతే. ఇప్పుడు ఆ పాత పోస్ట్‌ను చూస్తే.. రోహిత్ జెర్సీ నంబర్ 45. గిల్ జెర్సీ నంబర్ 77. ఒక చిన్న పోస్ట్‌తో అతడు తన వారసుడిని ఎంపిక చేసుకున్నాడు.
End of an era (45) and the start of a new one (77) ….. http://t.co/sJI0UIKm
— Rohit Sharma (@ImRo45) September 14, 2012
వన్డేల్లో 75 శాతం విజయాలతో ది బెస్ట్ కెప్టెన్‌గా ముద్రపడిన రోహిత్ ఇక ఆటగాడిగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున అప్పటికీ ఫిట్‌గా, ఫామ్‌తో ఉంటేనే హిట్‌మ్యాన్‌కు అవకాశం వస్తుంది. లేదంటే… కుర్రాళ్లతో కూడిన జట్టునే ప్రపంచ కప్ పోటీలకు పంపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.