Rohit Sharma | గోల్డెన్ ట్రోఫీతో హిట్‌మ్యాన్.. ఫొటోలు చూశారా..?
Rohit Sharma : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంటపడ్డాడు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ కప్పును చేతుల్లోకి తీసుకొని ఫొటోలకు పోజిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంటపడ్డాడు. శుక్రవారం న్యూయార్క్‌లోని నస్సావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వరల్డ్ కప్.. ఆ పక్కనే ఎన్బీఏ (NBA) విజేతలకు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అతడు చూశాడు. బంగారు వర్ణంలో ధగధగ మెరిసిపోతున్న ఆ కప్పును చేతుల్లోకి తీసుకొని ఫొటోలకు పోజిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అనంతరం ”మీ అభిమాన బాస్కెట్ బాల్ ఆటగాడు ఎవరు?’ అనే ప్రశ్నకు రోహిత్.. ‘మైఖేల్ జోర్డాన్'(Michael Zordan) అని బదులిచ్చాడు. ‘చికాగో బుల్స్’ (Chicago Bulls) జట్టు తరపున జోర్డాన్ ఆడిన తీరు చూసి తాను స్ఫూర్తి పొందానని తెలిపాడు. ‘జోర్డాన్‌తో పాటు లెబ్రాన్ జేమ్స్, స్టెఫ్ కర్రీల ఆట చూసేందుకు ఇష్టపడుతా. లారీ ఒబ్రియెన్ ట్రోఫీ చాలా బరువుగా ఉంది.అందుకేనేమో బాస్కెట్ బాల్ ఆటగాళ్లు భారీకాయంతో ఉంటారు’ అని టీమిండియా సారథి జోక్ చేశాడు.
ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్
పొట్టి వరల్డ్ కప్ సంగ్రామానికి మరో కొన్ని గంటల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్‌లు ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ జూన్ 1న షురూ కానుంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్(Ireland)తో తొలి మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా బహుశా రోహిత్‌కు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్. దాంతో, టీమిండియా ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) అందించే వెళ్లాలనే పట్టుదలతో హిట్‌మ్యాన్ ఉన్నాడు. ఐపీఎల్లో సెంచరీతో మెరిసిన రోహిత్ తనకు ఎంతో ఇష్టమైన పొట్టి ఫార్మాట్లో దంచి కొడితే భారత్‌కు శుభారంభం దక్కినట్టే.
ఇవి కూడా చదవండి
-
Ivanka Trump | పోర్న్ స్టార్ కేసులో దోషిగా తేలిన ట్రంప్.. ఇవాంక భావోద్వేగ పోస్ట్ - Bruhat Soma: స్పెల్లింగ్ బీ పోటీ నెగ్గిన 12 ఏళ్ల భారత సంతతి విద్యార్థి
-
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ దోషి.. జూలై 11న తుది తీర్పు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

