కొలంబో: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma).. భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో మరో అరుదైన మైలురాయిని అతను సొంతం చేసుకోనున్నాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. వన్డేల్లో భారీ రికార్డుకు దగ్గరయ్యాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన క్రికెటర్‌గా అతను నిలవనున్నాడు. ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అతను ఆ రికార్డును నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 247 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 9978 రన్స్ చేశాడు. దాంట్లో 30 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతను.. అత్యధికంగా 264 రన్స్ కొట్టాడు.