Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై ప్రకటించాడు. రోహిత్ నిర్ణయం అభిమానులను షాక్ గురి చేసింది. మహేంద్రసింగ్ ధోనీ సైతం 2014లో రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలు ముంచెత్తాడు. విరాట్ కోహ్లీ సైతం 2022లో హఠాత్తుగా టెస్ట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ ఓ అడుగు ముందుకేసి కెప్టెన్సీతో పాటు టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ డిసెంబర్ 2014లో టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని వదులుకున్నాడు.ఆ సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ డిసెంబర్ 26-30 మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆతిథ్య జట్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ టెస్ట్ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టి రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడవ టెస్ట్‌లో కెప్టెన్సీని వదిలేసిన తర్వాత విరాట్ కోహ్లీ చివరి టెస్ట్‌లో ధోని స్థానంలో జట్టును నడిపించాడు. కింగ్ కోహ్లీ 2022 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత, విరాట్ జనవరి 15న కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతకు ముందు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మకు టెస్ట్ నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియా పర్యటన వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 24 టెస్టులు ఆడింది. ఇందులో టీమిండియా 12 టెస్టులు గెలిచింది. తొమ్మిదింట్లో ఓడిపోగా.. మూడు డ్రాగా ముగిశాయి. టెస్టుల నుంచి రిటైర్ అయిన రోహిత్ వన్డేల్లో మాత్రం కనిపించనున్నాడు.