Rohit Sharma : పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. ఐర్లాండ్‌పై అదిరే బోణీ కొట్టిన టీమిండియా రెండో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Paistan)ను మట్టికరిపించింది. రెండు విజయాలతో జట్టు సూపర్ 8 బెర్తుకు చేరువైన వేళ హిట్‌మ్యాన్ ప్రకృతి ఒడిలో సేదతీరాడు.
అమెరికాతో మ్యాచ్‌కు రెండు రోజుల సమయం దొరకడమే ఆలస్యం కుటుంబంతో కలిసి న్యయార్క్‌లో పచ్చదనం నిండిన పార్క్‌లో కలియదిరిగాడు. భార్య రితికా సజ్దెహ్(Ritika Sajdeh), కూతురు సమైరా (Samaira)తో కలిసి ఫొటోలు దిగి ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేశాడు.
తమ నేచర్ ట్రిప్ ఫొటోలను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పిక్స్ చూసినవాళ్లంతా ‘పాక్‌ను ఓడించి ప్రకృతి ఒడిలో పరవశిస్తున్న కెప్టెన్’ అని కామెంట్లు పెడుతున్నారు. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య అమెరికాను ఢీకొననుంది. జూన్ 12న ఇరుజట్లు మరో రెండు పాయింట్ల కోసం తలపడనున్నాయి.