దుబాయ్: వన్డే బ్యాటింగ్ తాజా ర్యాంకు(ODI Batting Rankings)ల్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయారు. బ్యాటింగ్ ర్యాంకుల్లో అతను రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ .. ఐసీసీ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. వన్డే బ్యాటర్లలో టాప్ ప్లేస్‌కు చేరుకున్న రెండో న్యూజిలాండ్ బ్యాటర్‌గా నిలిచాడతను.
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన సెంచరీ చేశాడు. కరీబియన్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో అతను సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికి ఇది ఏడో సెంచరీ. ప్రస్తుతం మిచెల్‌కు 782 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కన్నా ఓ పాయింట్ ఎక్కువ ఉన్నాడతను.
1979లో కివీస్ బ్యాటర్ గ్లెన్ టర్నర్ ఒక్కడే ఆ దేశం తరపు నుంచి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కివీస్ మాజీ క్రికెటర్లు మార్టిన్ క్రోవ్, ఆండ్రూ జోన్స్, రోజర్ టౌస్, నాథన్ ఆస్టిల్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్తిల్, రాస్ టేలర్.. టాప్ అయిదు ర్యాంకుల్లో మాత్రమే నిలిచారు.
తాజా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ జర్దాన్ మూడవ స్థానంలో గిల్ నాలుగవ, కోహ్లీ అయిదో స్థానంలో నిలిచారు.
A fresh face atop the ICC Men’s ODI Batting Rankings 👌https://t.co/ZP1vtB20zq
— ICC (@ICC) November 19, 2025