దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్ అక్షర్ పటేల్(Axar Patel)కు హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్సు మిస్సైంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. అక్షర్ పటేల్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్సు మిస్ చేసుకున్నాడు. రెండో బంతికి తంజిద్ హసన్‌ను ఔట్ చేసిన అక్షర్.. ఆ తర్వాత మూడో బంతికి ముష్ఫికర్ రహీమ్‌ను ఔట్ చేశాడు. ఆ ఇద్దరూ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అయితే నాలుగో బంతికి జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను.. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన ఆ క్యాచ్‌ను అతను అందుకోలేకపోయాడు. దీంతో అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.
WHAT HAVE YOU DONE ROHIT 😯
Axar Patel misses out on a hatrrick vs Bangladesh as Rohit Sharma dropped a sitter in the slip region. pic.twitter.com/6h7txDasEN
— Sports Production (@SSpotlight71) February 20, 2025
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నది. ఆ జట్టు టాప్ ఆర్డర్ పెద్దగా స్కోర్ చేయలేదు. కేవలం తంజిద్ హసన్ మాత్రమే 25 రన్స్ స్కోర్ చేసి ఔటయ్యాడు. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 39 రన్స్ చేసింది.