Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి ఇంటర్నేషన్లో స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్, రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ కంటే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ 222 వన్డేల్లో ఈ ఘనత సాధించడగా.. రోహిత్ శర్మ 261 వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేశాడు.
ఇదిలా ఉండగా.. వన్డేల్లో వేగంగా 11వేల పరుగులు చేసిన ప్లేయర్లలో టాప్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 222 ఇన్నింగ్స్‌లో విరాట్ 11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 286 వన్డేలు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 288 ఇన్నింగ్స్, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ 293 వన్డేల్లో ఈ ఘనత సాధించారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో 11వేల పరుగులు చేసిన పదో ప్లేయర్‌గా నిలిచాడు. 18,426 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట ఈ రికార్డు ఉన్నది. 14, 234 పరుగులతో కుమార సంగక్కర, 13,963 పరుగులతో విరాట్ కోహ్లీ స్థానాల్లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.