దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు.. మాజీ దిగ్గర బ్యాటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఓ అంచనా వేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్‌లో లేకున్నా.. అతను మ్యాచ్ విన్నర్ అని యువీ పేర్కొన్నాడు. జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వన్డే క్రికెట్లో ఓ బ్యాటర్‌గా రోహిత్ పెద్ద మ్యాచ్ విన్నర్ అని, రోహిత్ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నా, అతను పరుగులు సాధిస్తున్నాడని, ఇది ప్రత్యర్థికి ప్రమాదకరమే అని, ఒకవేళ అతను ఫామ్‌లో ఉంటే, 60 బంతుల్లోనే రోహిత్ సెంచరీ కొట్టగలడని, అది అతని నాణ్యత అని యువీ తెలిపాడు. ఒకవేళ కొట్టుడు స్టార్ట్ చేస్తే, ఫోర్లు కాదు, అతను సిక్సర్లతో చెలరేగుతాడని, షార్ట్ బాల్స్ ఆడడంలో అతను దిట్ట అని, 150 కిలోమీటర్ల వేగంతో వేసినా, అతను అలవోకగా స్ట్రయిక్ చేస్తాడని చెప్పాడు. సింగిల్ హ్యాండెడ్‌గా మ్యాచ్‌ను గెలిపించే సత్తా రోహిత్‌కు ఉందని యువీ తెలిపాడు.
ఆదివారం జరిగే మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్‌కు అడ్వాంటేజ్ ఉందన్నాడు. ఎందుకంటే దుబాయ్‌లో పాకిస్థాన్‌కు ఎక్కుడ ఆడిన అనుభవం ఉందని, అక్కడి కండీషన్స్ ఆ జట్టుకు బాగా తెలుసు అని, స్లో వికెట్లపై ఇండియా, పాక్ ప్లేయర్లు బాగా ఆడుతారని, స్పిన్ బౌలర్లను ఇరు జట్లు బాగా ఆడుతాయని, కాకపోతే భారత జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్నట్లు యువీ చెప్పాడు. పాక్ వద్ద కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, కానీ ఆ రోజు ఆడే పరిస్థితిని బట్టి విజేత తెలుస్తాడని పేర్కొన్నాడు.
ఇండియన్ జట్టుకు కోహ్లీ, రోహిత్ శర్మలు వెన్నుముఖ అని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు.