MI vs KKR | రోహిత్, రికెల్టన్ అర్ధశతకాల హోరు.. రికార్డు ఛేదనతో మురిసిన ముంబై..!
MI vs KKR : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయంతో ఆరంభించింది. ఆరంభ మ్యాచ్ ఫోబియాను అధిగమిస్తూ రికార్డు విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ముంబై చెక్ పెట్టింది.
MI vs KKR : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విజయంతో ఆరంభించింది. ఆరంభ మ్యాచ్ ఫోబియాను అధిగమిస్తూ రికార్డు విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు ముంబై చెక్ పెట్టింది. 221 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(78), రియాన్ రికెల్టన్(81) అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో 80 పరుగులతో గట్టి పునాది వేసిన ఈ ద్వయం మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పింది. వీరిద్దరు ఔటైనా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్), తిలక్ వర్మ(20)లు ఆడుతూపాడుతూ లాంఛనం పూర్తి చేశారు.
పంతొమ్మిదో సీజన్ రెండో మ్యాచ్‌లోనూ రెండొందల లక్ష్యం సరిపోలేదు. వాంఖడేలోనూ బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు తేలిపోగా ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ ఛేదనలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(78), రియాన్ రికెల్టన్(81) బౌండరీలతో రెచ్చిపోయారు. ఫుల్ షాట్లతో హిట్‌మ్యాన్, స్టన్నింగ్ షాట్లతో రికెల్టన్ అలరించగా పవర్ ప్లేలోనే 80 పరుగులు దాటిన ముంబై స్కోర్ బోర్డు ఆ తర్వాతా పరుగులు పెట్టింది.
5⃣0⃣ for Ryan Rickelton 👌
1⃣0⃣0⃣-run opening stand sealed 🤝@mipaltan cruising in the run chase at 110/0 after 9 overs! 💪Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR pic.twitter.com/4GybcAdbx1
— IndianPremierLeague (@IPL) March 29, 2026
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓవర్లో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన రోహిత్ బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. కాసేపటికే 24 బంతుల్లో రికెట్లన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా కొండంత లక్ష్యం కాస్త మంచు ముక్కలా కరిగిపోయింది. అనుకుల్ రాయ్ డైవింగ్ క్యాచ్‌తో రోహిత్ ఔటైనా ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(16) ఉన్నంత సుపు ధనాధన్ ఆడాడు. ఫిఫ్టీతో చెలరేగిన రికెల్టన్ మెరుపు త్రోకు రనటవ్వగా.. అప్పటికే ముంబై గెలుపువాకిట నిలిచింది. 37 పరుగులు అవసరమైన వేళ తిలక్ వర్మ(20)తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా(18 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబై రెండు పాయింట్లు దక్కించుకుంది.
Anukul Roy is putting on a show in the field 🫡
A direct-hit run-out from the deep to send back Ryan Rickelton 🎯
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @KKRiders pic.twitter.com/KaqLga2CWF
— IndianPremierLeague (@IPL) March 29, 2026
రహానే, రఘువంశీ దూకుడు
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్‌తో ముంబై ఇండియన్స్‌కు సవాల్ విసిరింది. ముంబై కంచుకోట వాంఖడేలో ఓపెనర్లు అజింక్యా రహానే(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు ఊపపునిచ్చారు.

డేంజరస్ ఓపెనర్ అలెన్ ఔటైనా.. అర్ధ శతకంతో రెచ్చిపోయిన రహానేకు అంగ్క్రిష్ రఘువంశీ(51) మెరుపులు తోడవ్వగా ముంబై బౌలర్లు డీలా పడ్డారు. డెత్ ఓవర్లలో వైస్ కెప్టెన్ రింకూ సింగ్(33 నాటౌట్) తన స్టయిల్ విధ్వంసంతో కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

