World Cup 2023 | పురాతన మెట్లబావి వద్ద వరల్డ్ కప్ ట్రోఫీ.. రోహిత్, కమిన్స్ లుక్ చూశారా..?
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ అంతిమ సమరం రేపే. అహ్మదాబాద్(Ahmedabad)లో లక్షమంది ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రపంచ కప్‌ను ముద్దాడేది ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో భారత, ఆస్ట్రేలియా కెప్టెన్లతో...
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ అంతిమ సమరం రేపే. అహ్మదాబాద్(Ahmedabad)లో లక్షమంది ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రపంచ కప్‌ను ముద్దాడేది ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో భారత, ఆస్ట్రేలియా కెప్టెన్లతో శనివారం ఐసీసీ ఫొటోషూట్ నిర్వహించింది.
గుజరాత్‌లోని పురాతన అడలాజ్ మెట్లబావి(Adalaj Step Well) దగ్గర వరల్డ్ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ(Rohit Sharma), పాట్ కమిన్స్(Pat Cummins) ఫొటోలకు పోజిచ్చారు. ఈ ఫొటోకు ‘ఇద్దరు కెప్టెన్లు, ఒక ట్రోఫీ. ఇద్దిరిలో ఎవరు అల్టిమేట్ ప్రైజ్‌ను ఒడిసిపట్టుకుంటారు?’ అని క్యాప్షన్ రాసింది. నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
Two captains. One trophy 🏆
Who will lift the ultimate prize?#CWC23 pic.twitter.com/SjoMaRHpC2
— ICC Cricket World Cup (@cricketworldcup) November 18, 2023
క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్ ఫైనల్. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్ కప్ ఫైనల్. ఈసారి కప్పు కొడితే టీమిండియా ఖాతాలో మూడో ట్రోఫీ చేరుతుంది. ఇక కంగారూలు విజేతగా నిలిస్తే వాళ్లకు ఆరో టైటిల్ అవుతుంది. ఇరుజట్లకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

దాంతో, 20 ఏండ్ల తర్వాత ఆ ఓటమికి బదులు తీర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫామ్ పరంగా చూస్తే టీమిండియా.. ఆసీస్ కంటే మెరుగ్గా ఉంది. కానీ, ఐసీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఫైనల్లో ఆ జట్టు ఓటమన్నదే ఎరుగదు. టోర్నీ ఏదైనా కప్పుతో ఇంటికి తిరిగివెళ్లడమే ఆ జట్టుకు తెలుసు. అయితే.. 2003 జట్టుకు ఇప్పటి జట్టుకు ఎంతో తేడా ఉంది. ఈసారి ఒత్తిడికి చిత్తవ్వకుండా రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
-
Bhagavanth Kesari | ‘భగవంత్ కేసరి’ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాలా’ ఫుల్ వీడియో వచ్చేసింది.!
-
INDvsAUS: రోహిత్, విరాట్ కాదు.. ఆస్ట్రేలియా భయమంతా అతడి గురించే..! కమిన్స్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

