న్యూఢిల్లీ: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొప్పన్న(Rohan Bopanna).. అంతర్జాతీయ టెన్నిస్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నలుగురు భారతీయ ఆటగాళ్లలో అతనొక్కడు. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శనివారం రోహన్ బొప్పన్న పేర్కొన్నాడు. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయాన్ని అతను తన ఎక్స్‌లో పోస్టు చేశాడు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు అతను టెన్నిస్ కెరీర్‌ను కొనసాగించాడు. 45 ఏళ్ల ఉన్న బొప్పన్న చివరి సారి పారిస్ మాస్టర్స్ ఆడాడు. ఆ టోర్నీలో కజక్ ప్లేయర్‌తో జోడి కట్టాడు. కానీ ఓపెనింగ్ రౌండ్లోనే ఆ జంట ఇంటిబాటపట్టింది.
రిటైర్మెంట్ సందర్భంగా ఎక్స్ అకౌంట్లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఎ గుడ్‌బై.. బట్ నాట్ ద ఎండ్ అని బొప్పన్న తన జ్ఞాపకాలను రాసుకొచ్చాడు. అఫీషియల్‌గా తన రాకెట్‌ను హ్యాంగ్ చేస్తున్నట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. కూర్గ్ నుంచి వచ్చిన తాను ప్రపంచ దేశాల్లో అనేక టోర్నీల్లో ఆడినట్లు తెలిపాడు. ఓల్డేజ్‌లో గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆటగాడిగా బొప్పన్న రికార్డు క్రియేట్ చేశాడు. డబుల్స్ లోనూ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఫేర్వెల్ పోస్టులో పేరెంట్స్, ఫ్యామిలీ, కోచ్, ట్రైనర్స్‌కు థ్యాంక్స్ తెలిపారు.
❤️❤️❤️ pic.twitter.com/IS3scPrwhW
— Rohan Bopanna (@rohanbopanna) November 1, 2025