Asian Games: బొపన్న జోడికి గోల్డ్ మెడల్
Asian Games: ఇండియాకు మరో స్వర్ణ పతకం దక్కింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో బొపన్న జోడికి పతకం వచ్చింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరుకున్నది.
హాంగ్జూ: ఆసియా క్రీడల్లో(Asian Games) ఇండియాకు మరో స్వర్ణ పతకం దక్కింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో బొపన్న జోడికి పతకం వచ్చింది. టెన్నిస్ ఈవెంట్లో ఇండియా మొత్తం రెండు మెడల్స్ మాత్రమే కైవసం చేసుకున్నది. ఇవాళ జరిగిన మిక్స్డ్ డబుల్స్ గేమ్‌లో బొపన్న, రుతుజా భోస్లే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. తొలుత ఓ సెట్‌ను కోల్పోయినా.. ఆ తర్వాత ఇద్దరూ తమ పవర్ గేమ్‌తో ఆకట్టుకున్నారు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బొపన్న-భోస్లే జోడి 2-6, 6-3, 10-4 తేడాతో తైపికి చెందిన సుంత్ హో హువాంగ్, ఇన్ షౌ లియాంగ్ జంటపై గెలుపొందారు.
𝙂𝙊𝙇𝘿 𝙄𝙏 𝙄𝙎!🥇🌟
🇮🇳 mixed doubles duo, @RutujaBhosale12 and #TOPSchemeAthlete @rohanbopanna have clinched GOLD, showcasing their unmatched talent and teamwork on the world stage. 🏆🎾
Let's applaud their remarkable victory at the #AsianGames2022 with pride and passion!… pic.twitter.com/kpZs1JcLq4
— SAI Media (@Media_SAI) September 30, 2023
రెండవ సెట్లో 27 ఏళ్ల భోస్లే విరోచిత ఆటను ప్రదర్శించింది. స్టన్నింగ్ రిటర్న్ షాట్స్‌తో కేక పుట్టించింది. సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్‌లతో కూడిన పురుషుల డబుల్స్ జోడి శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో బొప్పన్నకు స్వర్ణ పతకం దక్కడం ఇది రెండోసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

