కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. పాక్ కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. రాత్రి వేళ తేమ ఉంటుందో కాబట్టి, దాన్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నామని, డిఫెండింగ్ చాంపియన్ కావడం వల్ల కాస్త వత్తిడి ఉంటుందని కూడా పేర్కొన్నాడు. హరిస్ రౌఫ్ ఫిట్‌గా ఉన్నాడని, అతను ఈ మ్యాచ్‌లో ఆడుతున్నట్లు చెప్పాడు.
🚨 TOSS & PLAYING XI 🚨
Pakistan win the toss and opt to bowl first 🏏
Our team for Match 1 of the ICC #ChampionsTrophy 2025 🇵🇰#PAKvNZ | #WeHaveWeWill pic.twitter.com/SnAfRzZtsK
— Pakistan Cricket (@TheRealPCB) February 19, 2025
కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ తమ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి భారీ పరుగులు చేయాల్సి ఉంటుందన్నారు. మ్యాట్ హెన్రీ జట్టులోకి వచ్చినట్లు చెప్పాడు.
Our XI for Champions Trophy Game 1! Batting first in Karachi after a toss win for Pakistan. Watch play LIVE in NZ on @skysportnz 📺 LIVE scoring | https://t.co/cVlkusQf3c 📲 #ChampionsTrophy #CricketNation pic.twitter.com/ItFsfbi5Mb
— BLACKCAPS (@BLACKCAPS) February 19, 2025