Riyan Parag | హాట్ వీడియోల సెర్చింగ్.. ఐపీఎల్ స్టార్‌కు యూట్యూబ్ పరేషాన్
Riyan Parag : ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ రియాన్ పరాగ్(Riyan Parag) కొత్త చిక్కుల్లో పడ్డాడు. పరాగ్ యూట్యూబ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల హాట్ వీడియోలు వెతికిన దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
Riyan Parag : ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ రియాన్ పరాగ్(Riyan Parag) కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఓవరాక్షన్ స్టార్‌గా పేరొందిన పరాగ్ తన యూట్యూబ్ హిస్టరీ(You Tube)లీక్ అవడంతో పరేషాన్ అవుతున్నాడు. పరాగ్ యూట్యూబ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల హాట్ వీడియోలు వెతికిన దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోలను చూస్తే.. ఈ స్టార్ క్రికెటర్ ‘అనన్యా పాండే హాట్’, ‘సారా అలీఖాన్ హాట్’ వీడియోలను సెర్చ్ చేశాడని తెలుస్తోంది. దాంతో, అందరూ పరాగ్‌ను విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. . సోషల్ మీడియాలో అతడిపై భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై పరాగ్ మాత్రం ఇంకా స్పందించలేదు.
పదహారో సీజన్లో ఘోరంగా విఫలమైన పరాగ్ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో రఫ్ఫాడించాడు. వరుస సెంచరీలతో తనలో సత్తా తగ్గలేదని, తానొక మ్యాచ్ విన్నర్‌ని అని నిరూపించుకున్నాడు. రంజీ జోరును పదిహేడో సీజన్లోనూ కొనసాగించిన పరాగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. వరుసగా అర్ధ సెంచరీలతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే.. కీలకమైన నాకౌట్ మ్యాచుల్లో మాత్రం భారీ స్కోర్ చేయలేకపోయాడు. 2024 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ సీజన్లో పరాగ్ మూడో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 16 మ్యాచుల్లో 52 సగటుతో అతడు 573 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి
- Kavitha | కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు..
- Norway Chess | ప్రజ్ఞానంద ముందంజ.. డ్రాతో సరిపెట్టుకున్న కార్ల్సన్
- Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. ప్రజలను అప్రమత్తం చేసిన సీఎం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

