మెల్బోర్న్ : సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రధాన ప్రత్యర్థులు నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్ వేర్వేరు పార్శాలలో బరిలోకి దిగనున్నారు. దీనితో సంయుక్తంగా 43 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వీరు ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశముంది. ఈ టోర్నీ డ్రాను గురువారం వెల్లడించారు. రికార్డు స్థాయిలో పదోసారి ఇక్కడ టైటిల్ గెలవాలనుకుంటున్న నాలుగో సీడ్ జొకోవిచ్ తొలి రౌండ్లో స్పెయిన్‌కు చెందిన రాబర్టొ కార్బల్లెస్తో తలపడతాడు.
నాదల్ తొలి రౌండ్లో బ్రిటన్ ఆటగాడు జాక్ డ్రేపర్‌ను ఢీకొంటాడు. కాగా మహిళల టాప్ ర్యాంకర్ ఇగా సియాటెక్ జర్మనీకి చెందిన జూల్ నీమియర్తో తన పోరు ప్రారంభించనున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఈ నెల 16నుంచి 29వ తేదీవరకు జరుగుతుంది.