IPL 2026 : ఐపీఎల్ స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) ఫ్రాంచైజీ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతడి నిర్ణయానికి మద్ధతిస్తుంటే.. మరికొందరు బ్యాటింగ్ ఆర్డర్లో ఇమడలేకే తదుపరి సీజన్లో కొత్త జట్టుకు ఆడేందుకు సిద్దమవుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంజూ రాజస్థాన్‌ను వీడడానికి అసలు కారణమేంటో చెప్పేశాడు మాజీ క్రికెటర్ బద్రినాథ్ (Badrinath). రాజస్థాన్‌తో శాంసన్ తన అనుబంధాన్ని తెంచుకోవాలని భావించడానికి రియాన్ పరాగ్ (Riyan Parag) ప్రధాన కారణం అంటున్నాడీ తమిళ తంబీ.
‘పద్దెనిమిదో సీజన్లో సంజూ గాయపడడంతో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పరాగ్ సారథిగా అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్‌కు సంజూను ఆడించాల్సిన అవసరం రాలేదు. యువకుడైన ఈ అస్సాం ప్లేయర్ మరికొన్ని సీజన్లు జట్టుతో కొనసాగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో శాంసన్‌ను ఆడించినా కెప్టెన్‌గా పరాగ్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గ్రహించిన సంజూ వచ్చే సీజన్లో జట్టు మారాలనే నిర్ణయానికి వచ్చి ఉంటాడు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అతడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) గూటికి చేరుతాడని అనిపిస్తోంది. అదే జరిగితే ఎంఎస్ ధోనీ (MS Dhoni) స్థానాన్ని శాంసన్ భర్తీ చేస్తాడని చెప్పడంలో సందేహం లేదు’ అని బద్రినాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Subramaniam Badrinath feels Riyan Parag being pushed for the captaincy role is one of the major reasons behind Sanju Samson wanting a potential move out of Rajasthan Royals. #SanjuSamson #RiyanParag #IPL #RajasthanRoyals #RR #CricketTwitter pic.twitter.com/lLxkvLG5lZ
— InsideSport (@InsideSportIND) August 12, 2025
రాజస్థాన్‌కు శాంసన్ గుడ్ బై చెప్పాలనుకోవడానికి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా ఒక కారణని కొందరి వాదన. నిరుడు వేలంలో రూ.1.5 కోట్లకు అమ్ముడైన వైభవ్.. 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 35 పరుగుల.. ఆపై గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉతికారేస్తూ.. 35 బంతుల్లోనే మెరుపు శతకంతో తాను ఫ్యూచర్ స్టార్ అని చాటుకున్నాడీ యంగ్‌స్టర్.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
అటు కెప్టెన్సీకి పరాగ్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఇటు ఓపెనింగ్ స్థానంలో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ పాతుకుపోయేలా ఉన్నాడు. ఈ ఇద్దరిని రాజస్థాన్ వదులుకునే సాహసం చేయదు కాబట్టి తన అవసరం ఉన్న జట్టుకు మారడం మంచిదని శాంసన్ అనుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఎంఎస్ ధోనీ మరో సీజన్ ఆడడం సందేహమే. సంజూ గనుక సీఎస్కేతో చేరితే అటు వికెట్ కీపర్, కెప్టెన్‌గా అవకాశం దక్కించుకోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.