ఓల్డ్ ట్రాఫర్డ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టులో రిషబ్ పంత్(Rishabh Pant) గాయపడ్డ విషయం తెలిసిందే. వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ కోసం ప్రయత్నం చేయగా, ఆ బంతి పంత్ పాదానికి తగిలింది. ఆ గాయానికి చెందిన స్కానింగ్ రిపోర్టును రిలీజ్ చేశారు. కాలు పాదానికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. పెయిన్ కిల్లర్లు తీసుకుని పంత్ బ్యాటింగ్ చేయగలడా లేదా అన్న కోణంలో బీసీసీఐ మెడికల్ బృందం అన్వేషిస్తున్నది. ఆరు వారాల పాటు అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్సు ఉంది. మరొకరి సపోర్టుతో పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడని, అతను బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగానే తోస్తోందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఇంగ్లండ్ టూరు నుంచి అతన్ని తప్పించినట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.
గాయం తీవ్రంగా ఉండడం వల్ల అతన్ని ఇంగ్లండ్ టూరు నుంచి పూర్తిగా తప్పించే అవకాశాలు ఉన్నాయి. లండన్‌లోని ఓవల్‌లో జూలై 31 నుంచి అయిదో టెస్టు జరడాల్సి ఉంది. మాంచెస్టర్ టెస్టు తొలి రోజు 68వ ఓవర్లో గాయం కాగానే పంత్ తన కాలు కింద పెట్టేందుకు తీవ్ర ఇబ్బందిపడ్డారు. టీమ్ ఫిజియో హుటాహుటిన్ గ్రౌండ్‌కు వెళ్లాడు. బంతి బలంగా తగలడంతో.. కుడి కాలు చివరి వేలి వద్ద రక్తం వచ్చింది. క్షణాల్లో ఆ ప్రదేశం వాచింది. కాలు కింద పెట్టేందుకు 27 ఏళ్ల బ్యాటర్ కష్టపడ్డాడు. గోల్ఫ్ స్టయిల్ బగ్గీలో గాయపడ్డ పంత్‌ను తరలించారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో 462 రన్స్ చేశాడు. ప్రస్తుత టూర్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో శుభమన్ గిల్ 619 రన్స్ చేసి టాప్‌లో ఉన్నాడు.