బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘గాయాల నుంచి కోలుకుంటున్నా. ప్రతి రోజూ ఎంతో కొంత మెరుగవుతున్నా. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చేరేందుకు బెంగళూరుకు వచ్చా.
ఈ క్రమంలో మా జట్టు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇక్కడే ఉండటంతో ఆటగాళ్లతో కాసేపు మాట్లాడా’ అని పంత్ పేర్కొన్నాడు. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న పంత్.. ఢిల్లీ జట్టును ఎంతో మిస్ అవుతున్నానని అన్నాడు. శనివారం ఢిల్లీ జట్టు బెంగళూరుతో తలపడనున్న నేపథ్యంలో తమ జట్టు గెలువాలని ఆశిస్తున్నట్లు పంత్ పేర్కొన్నాడు.