ఢిల్లీ: తన ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి గత సీజన్ దాకా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఈసారి ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. రిటెన్షన్ ఫీజు విషయంలోనే పంత్.. ఢిల్లీ యాజమాన్యంతో విభేదించాడని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో పంత్ స్పందించాడు. ‘నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని గవాస్కర్ మాట్లాడిన వీడియోకు ఎక్స్‌లో రిైప్లె ఇచ్చాడు.